నీటి సంరక్షణ కోసం ఇంకుడు గుంతలు ఏర్పాటు..
మద్నూర్ జూలై 24(నేటి జ్యోతి).
ఉమ్మడి మద్నూర్ మండలంలో నీటి సంరక్షణ కోసం వి బి జీ రాంజీ పథకంలో భాగంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారు చేసింది. అందులో భాగంగా మండలంలోని మేనూర్ గ్రామపంచాయతీ పరిధిలో బోర్ల వద్ద రీఛార్జి గుంతలను ఏర్పాటు చేశారు. మద్దూర్ ఎంపీడీవో సత్యనారాయణ బోర్ల వద్ద ఇంకుడు గుంతలకు శ్రీకారం చుట్టారు. ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.