మద్నూర్ జూలై 16 (నేటి జ్యోతి)
మండలంలోని మేనూర్ గ్రామానికి చెందిన ఆడబిడ్డ బాన్స్వాడ మాతా శిశు ఆసుపత్రిలో పురుడు పోసుకోగా తీవ్ర అస్వస్థకు గురి కావడంతో వైద్యులు నిజామాబాద్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. నిజామాబాద్ ఆసుపత్రి వైద్యులు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. బాలింతరాలు హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందకుండా తిరిగి మేనూర్ రావడం జరిగింది . ఈ విషయం తెలుసుకున్న కామారెడ్డి జిల్లా వైద్యాధికారి వెంకట్ ఆ గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు మాట్లాడి 108 ప్రత్యేకంగా ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపించారు.